Wednesday, November 20, 2024

పేద‌ల‌కు ఇళ్ళ ప‌ట్టాలు అంద‌జేసిన మంత్రి పువ్వాడ‌

సుదీర్ఘ కాలం నుండి పేదలు ఎదుర్కొంటున్న ఇళ్ళ పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంద‌జేశారు.దాంతో ఏళ్ల నాటి సుదీర్ఘ పేదల కల నేడు తీరింది. 25 ఏళ్లగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు నేడు ధైర్యం కల్పించారు మంత్రి పువ్వాడ. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ శ్రీనివాస నగర్ కాల్వకట్టలో 450 మంది నివాసకులకు శాశ్వత ఇళ్ళ పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పంపిణి చేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల సుదీర్ఘ కాల నేడు నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడి పేదలు తమకు ఇళ్ళ పట్టలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. మీరు పడిన కష్టాలు తెలుసునని అన్నారు ..ఇక్కడి పేదలకు పట్టాలు ఇవ్వాలని స్థానిక నాయకుడు ధనాల శ్రీకాంత్ అనేక మార్లు తమ దృష్టికి తెచ్చారని వివరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళమని వివరించారు. సీఎం సానుకూలంగా స్పందించడం వల్లే నేడు పట్టాలు ఇవ్వడం జరిగిందని వివరించారు.

మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి త్రాగునీరు కూడా ఎర్పాటు చేస్తామన్నారు. ఏ ఒక్కరు త్రాగునీటి కోసం కిలోమీటర్ దూరం వెళ్లాల్సిన పనిలేదన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇటీవలే శ్రీనివాసనగర్ నందు 353 పట్టాలు ఇచ్చిన విషయం గుర్తు చేశారు. త్వరలోనే ఖనాపురంలోని రాజీవ్ గుట్టలోని నిర్వాసితులకు పట్టాలు ఇస్తామన్నారు. దీనితో పాటు జీఓ. నెం. 58, 59 క్రింద హక్కు పత్రం, అదే అడ్రస్ తో ఆధార్ కార్డు కూడా ఇప్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ధనాల రాధ, కమర్తపు మురళి, పసుమర్తి రాం మోహన్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, RJC కృష్ణ, చిన కొండయ్య, వడ్డెలి లెనిన్, మండదపు రామక్రిష్ణ, ధనాల తహశీల్దార్ శైలజ మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్లు ధనాల రాధ, కమర్తపు మురళి, పసుమర్తి రాం మోహన్, కొత్తపల్లి నీరజ, Amc చైర్మన్ లక్ష్మిప్రసన్న, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, RJC కృష్ణ, ధనాల కొండయ్య, తహశీల్దార్ శైలజ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement