ఏపీ మంత్రులు వారి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రిగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కాగా గనులు, విద్యుత్, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు.
తాను తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడానని, జగన్‌ని పిన్నెల్లి కలుస్తారని చెప్పారు. అలాగే, అన్నా రాంబాబు, సామినేని ఉదయభానులతో కూడా మట్లాడానని తెలిపారు. వారికి పార్టీ గుర్తింపు, గౌరవం ఉంటుందని అన్నారు. తనకు ఇచ్చిన మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తానని పెద్దిరెడ్డి అన్నారు. ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్‌ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గనుల శాఖలో చేపట్టిన సంస్కరణల వలన ఆదాయం పెరిగిందని, దాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు.
మూడు శాఖల్లో మంచి పేరు తెచ్చుకుంటా – మంత్రి పెద్దిరెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement