ఏపీ కేబినెట్ భేటీ మార్చి 3న జరగాల్సింది. అయితే ఈ భేటీని మార్చి 7వ తేదీన కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కాగా మేకపాటి గౌతమ్‌రెడ్డి పెద్దకర్మ దృష్ట్యా కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై గవర్నర్, సీఎం చర్చించారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి ఆయన అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పెద్దకర్మ – ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
Advertisement
తాజా వార్తలు
Advertisement