హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అటు పీసీసీ ఛీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార పార్టీ టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి టీఆర్ ఎస్ పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. అదే పనిలో భాగంగా మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు గుప్పించారు రేవంత్. మంత్రి మల్లారెడ్డి అనుమతి తెచ్చుకున్న యూనివర్సిటీ స్థలం సైతం కబ్జా చేసిందేనంటూ.. తప్పుడు పత్రాలు చూపించి అనుమతి పొందారంటూ ఆరోపించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ వ్యవహారంపై దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ చేశారు.
అయితే తాజాగా రేవంత్ కు కౌంటర్ ఇస్తూ సవాల్ విసిరారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేయ్, నేను కూడా మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేద్దాం అని సవాల్ విసిరారు. ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తా.. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. రేవంత్ పీసీసీ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి నాపై పోటీ చేయాలి.. ఇద్దరం పోటీ చేద్దాం.. ఎవరు గెలిస్తే వారే హీరో’’ ఓడిపోయిన వాడు జీరో అని అని రేవంత్‌రెడ్డికి మల్లారెడ్డి సవాల్ విసిరారు. మధ్య మధ్యలో కొన్ని బూతు పదాలు వాడుతూ చివరికి జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ ముగించారు మల్లా రెడ్డి.
ఇది కూడా చదవండి: