రేపు కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గుంగుల కమలాకర్ వెల్లడించారు.
మీడియా సమావేశంలోగంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా రూ.615 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మున్పిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారని తెలిపారు. దీంతో పాటుగా శబర్మతి తరహాలో రూ. 410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కూడ భూమి పూజచేస్తారని తెలిపారు. ఇందులో అధికశాతం పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌ను వచ్చే 18 నెలల్లో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలాగే రూ.615 కోట్ల కార్పొరేషన్ నిధులతో చేపట్టే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. గత యాభైఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఆరేండ్లలో చేసి చూపించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండండదలతో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే నంబర్ 2 సిటీగా మార్చుతున్నామని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కరీంనగర్ లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ – రాష్ట్రంలోనే నెంబర్2 సిటీగా కరీంనగర్
Advertisement
తాజా వార్తలు
Advertisement