తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కేటీఆర్ వెల్లడించారు. ‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించి టెస్టు చేయించుకుని జాగ్రత్తగా ఉండండి’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన కేసీఆర్ పలు చికిత్సల కోసం సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను పరామర్శించేందుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ వెళ్లారు. దీంతో నిన్న స్వల్ప లక్షణాలతో ఎంపీ సంతోష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా మంత్రి కేటీఆర్‌కు కూడా కరోనా సోకింది.