హైదరాబాద్ సిటీ జనానికి మరో ఆహ్లాదకరమైన చోటు అందుబాటులోకి వచ్చింది. సిటీకి అత్యంత దగ్గరగా ఉండే గండిపేటలో సుందరంగా తీర్చిదిద్దిన మరో పార్క్ ని ఇవ్వాల (మంగళవారం) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గండిపేట పరిధిలో అభివృద్ధి చేసిన ఎకో పార్క్‌ను ఈ సాయంత్రం ప్రారంభించారు. ఉస్మాన్ సాగర్ సరస్సుకు వందేళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని 5.9 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎకో పార్క్‌ను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది.
ఇక.. గండిపేట ఎకో పార్క్‌లో పిక్నిక్ స్పేస్‌తో పాటు ఉస్మాన్ సాగర్ బ్యాక్ డ్రాప్‌గా యాంఫీ థియేటర్, ఫ్లవర్ టెర్రెస్, వాక్ వేస్, రెండు ఆర్ట్ పెవిలియన్లు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. అవుటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఏర్పాటు చేసిన ఈ పార్క్ హైదరాబాద్ జనాలకు పిక్నిక్ స్పాట్ గా మారుతుందని మునిసిపల్ శాఖ అధికారులు చెప్పారు.