Saturday, November 23, 2024

Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి

ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ రైలు ప్రమాద ఘట‌న‌పై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆ దుర్ఘ‌ట‌న‌లో అధిక సంఖ్యలో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల ఆయ‌న దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు ఆయ‌న సంతాపం తెలిపారు. ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. రైలు ప్ర‌మాదాన్ని నివారించే యాంటీ కొలిజ‌న్ డివైస్‌లు ఏమైన‌ట్లు మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్ర‌మాద తీవ్ర‌త చాలా ఊహించ‌ని రీతిలో ఉంద‌ని, ఈ విషాదం జ‌ర‌గాల్సింది కాదు అని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement