తెలుగు రాష్ట్రాలలో జల వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల నేతలు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఈ వివాదంపై మంత్రి కేటీఆర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. శనివారం నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్.. కృష్ణా నదీ జలాల వివాదంపై స్పందించారు. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నీటి విషయంలో ఏపీతోనే కాదు.. దేవుడితో కొట్లాడతామని స్పష్టం చేశారు. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటామని.. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామన్నారు. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు పరమావధి అని తెలిపారు. భారత దేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఊహించని విధంగా వరి పంట పండిందని, రైతుల దగ్గర పంట కొన్నామని తెలిపారు. రూ.10 కోట్లతో టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేసామని, చేనేత భీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరోసారి జ్వర సర్వే