అచ్చే దిన్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నేటితో 8 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కాసేపటి క్రితం వ్యంగ్యంగా విమర్శలు చేశారు. మోదీ అచ్చే దిన్కు 8 ఏళ్లు నిండాయన్న కేటీఆర్.. ఈ 8 ఏళ్లలో మోదీ సర్కారు సాధించిందేమిటి అన్న వాటిని ప్రస్తావిస్తూ ట్వీట్ సంధించారు. ఈ 8 ఏళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరిందన్న కేటీఆర్… 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం దాపురించిందని పేర్కొన్నారు. ఇక 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరిందని, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పీజీ ధరలు దేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. 42 ఏళ్లలో అత్యంత దారుణ స్థితికి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘అచ్చే దిన్’పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్..
Advertisement
తాజా వార్తలు
Advertisement