మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. ఆపదలో వున్నవారికి సాయం చేయడం కంటే పెద్దపని ఏదీ లేదని భావించి బిజీ షెడ్యూల్ లోనూ ఇద్దరు యువకుల ప్రాణాలను కాపాడేందుకు తాపత్రయపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్ర శివారులో ఔటర్ బైపాస్ రోడ్డుపై, మెడికల్ కాలేజీకి సమీపంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో వారికి గాయాలయ్యాయి. ఈ సమయంలో అటువైపుగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కాన్వాయ్ వెళుతున్నది. జరిగిన ప్రమాదాన్ని చూడగానే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని రెండు కార్లలో గాయపడిన ఆ ఇద్దరు క్షతగాత్రులను సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. వారితోపాటు తన పీఏ మహేందర్‌రెడ్డి, ఎస్కార్ట్ పోలీసులను పంపించడమే కాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఫోన్ లో సూచించారు. ఆపదలో వున్నవారిని కాపాడి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు కేటీఆర్. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో వున్న తమవారిని కాపాడిన మంత్రి కేటీఆర్ కు క్షతగాత్రుల కుటుంబసభ్యులు, బంధువులు ధన్యవాదాలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి కేటీఆర్ సాయం
By mahesh kumar
- Tags
- important news
- Important News This Week
- Important News Today
- IT Minister KTR
- karimnagar latest news
- Karimnagar Live News
- karimnagar local news today
- karimnagar news
- karimnagar varthalu
- ktr
- Latest Important News
- MINISTER KTR
- Most Important News
- road accident
- Telanagana News
- Telangana Live News Today
- telangana news
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- telugu viral news
- Today karimnagar News
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- TS News Today Telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement