Sunday, November 24, 2024

పారిస్ తో కేటీఆర్ బిజీబిజీ.. తొలిరోజు నుంచే ప్రముఖులతో భేటీలు

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ పర్యటనలో ఉన్న  మంత్రి కేటీఆర్‌ బిజీ బిజీగా గడుపుతున్నారు. తన తొలి రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఫ్రాన్స్‌ మధ్య ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డాటా వంటి అంశాల్లో పరస్పర సహకారం అందించుకొనే అవకాశాలపై చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తీసుకొంటున్న చర్యలను, ఓపెన్‌ డాటా పాలసీ గురించి, డిజిటల్‌ ఇన్‌ఫ్రా చర్యలపై మంత్రి కేటీఆర్‌, హెన్రీకి వివరించారు. ఈ సమావేశంలో ఫ్రాన్స్‌లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కేఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ కొణతం దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

కాగా, శుక్రవారం(అక్టోబర్ 29) ఫ్రాన్స్‌ ఎగువ సభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా-2021’ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ‘గ్రోత్‌-డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తారు. అనంతరం పలువురు ఫ్రెంచ్‌ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులు, అవకాశాలపై వారికి వివరిస్తారు. ఫ్రాన్స్‌ ప్రధాని ఇమ్మాన్యూయెల్‌ మాక్రాన్‌ సారథ్యంలో ‘యాంబిషన్‌ ఇండియా-2021’ పేరుతో వాణిజ్య సదస్సు జరుగనున్నది. 

ఇది కూడా చదవండి: నేడు ఏపి కేబినెట్ భేటీ.. ఆన్ లైన్ లో టికెట్లపై చర్చ!

Advertisement

తాజా వార్తలు

Advertisement