ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్‌టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్‌టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు. రూ.1200 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ సంస్థలో 11,100 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 187 ఎకరాల భూమిని కేటాయించింది. అనంతరం మిషన్ భగీరథ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement