Friday, November 22, 2024

Hyderabad: సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటుకు.. శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌

ఓఆర్ఆర్ వెంబ‌డి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటుకు నానక్ రామ్‌గూడ వద్ద మంత్రి కేటీఆర్‌ మంగళవారం శుంకుస్థాపన చేశారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. మొదటి దశలో 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడెల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను.. 16 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేస్తారు.

2023 వేసవి నాటికి అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ లక్ష్యంగా పెట్టుకున్నది. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో ట్రాక్‌ను శంకుస్థాపన చేశామన్నారు.

‘‘ఆరు నెలల కిందట ఓ మిత్రుడు సౌత్‌ కొరియాలో సైక్లింగ్‌ ట్రాక్‌ ఉందని, హైవే మధ్యలో సోలార్‌ ప్యాన్లతో కట్టారు.. చూడడానికి బాగుంది.. హైదరాబాద్‌లో, తెలంగాణలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భారత్‌లో ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు.. ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని’ అని సూచించారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అమలుచేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి కేటీఆర్​ గుర్తు చేశారు. దానికి అనుగుణంగా అధికారులను సౌత్‌ కొరియాకు వ్యక్తిగతం పంపామని, ఆ తర్వాత దుబాయిలో బాగుందంటే వెళ్లి అక్కడి మోడల్‌ను స్టడీ చేశారన్నారు. విస్తృతమైన పురోగతి, పట్టణీకరణ జరుగుతుందని, దానికి తగినట్లుగా స్థానికంగా ఉండే యువకులు, ఐటీ రంగాల్లో పనిచేసే వారందరికీ ఇంటి నుంచి ఆఫీస్‌కి, ఆఫీస్‌ నుంచి ఇంటికి అవసరమైతే బైసైక్లింగ్‌ చేస్తూ వెళ్లి వచ్చే పద్ధతి ఏర్పాటు చేస్తే బాగుంటుందని, కేవలం ఆఫీస్‌కి వెళ్లికి రాకుండా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం సైతం బాగుంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement