Thursday, November 21, 2024

పురపాలక చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పురపాలక చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం పద్దులపై చర్చకు సమాధానం ఇచ్చారు. చేనేత గురించి మాట్లాడుతూ.. చేనేతకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు దక్కాయని తెలిపారు. రాష్ట్రం చేనేత రంగాన్ని ఆదుకుంటుంటే.. కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై ప్రధాని మోదీ 5 శాతం పన్ను విధించారని.. దాన్ని 12 శాతానికి పెంచాలని చూస్తున్నారన్నారు. చేనేతకు సంబంధించిన అనేక బోర్డులను కేంద్రం రద్దు చేసిందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఐటీఐఆర్ పై కేంద్రానికి ఎన్నో సార్లు డీపీఆర్ ఇచ్చామన్నారు. 2018వరకు ఐటీఐఆర్ పై కేంద్రం సమాధానమివ్వలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డగోలుగా అమ్మేస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement