Saturday, November 23, 2024

లాక్ డౌన్ పొడిగింపుపై కేటీఆర్ కీలక వ్యాఖ్య

కరోనా కట్టడికి తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతోంది. మే 12 నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా… లాక్ డౌన్ ను పొడిగిస్తారనే చర్చ సర్వత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యాలు చేశారు. ట్విట్టర్ లో Ask KTR కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… లాక్ డౌన్ పొడిగింపుపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని, ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుందని వెల్లడించారు.

ఇక, రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరతకు డిమాండ్-సప్లై అంశమే కారణమని అభిప్రాయపడ్డారు. 70 శాతం ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.  2.9 కోట్ల వయోజనుల్లో 1.9 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్లు అమల్లో ఉన్నందున ఆ లెక్కన 3.8 కోట్ల డోసులు అవసరం అవుతాయని కేటీఆర్ వివరించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement