Thursday, October 31, 2024

Breaking: శిల్పా లేవుట్‌ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

శిల్పా లేఅవుట్‌ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ.250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. వంతెన పొడవు 956 మీటర్లు కాగా.. వెడల్పు 16 మీటర్లు. హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అతి పొడవైనది కావడం విశేషం. ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో పూర్తయిన 17వ ప్రాజెక్టు.

ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ వంతెన ఓఆర్ఆర్‌పైకి చేరనున్నది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది మూడోది.

Advertisement

తాజా వార్తలు

Advertisement