Saturday, November 23, 2024

రాష్ట్రం దాటిన మంత్రి కేటీఆర్ సాయం – పంజాబ్ క్రీడాకారిణినికి రూ. 15ల‌క్ష‌లు

మంత్రి కేటీఆర్ దృష్టికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా వెంట‌నే స్పందిస్తారనే సంగ‌తి తెలిసిందే. స‌మ‌స్య ఏదైనా వెంట‌నే ప‌రిష్కారాన్ని చూపిస్తుంటారాయ‌న‌. కాగా పుట్టు మూగ అయిన పంజాబ్ చ‌ద‌రంగ క్రీడాకారిణి మాలిక హండాకు మంత్రి కేటీఆర్ త‌న సొంత నిధుల‌తో రూ.15ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందించి వార్త‌ల్లో నిలిచారు. అనేక జాతీయ పోటీల్లో విజయం సాధించినా.. వైకల్యం కారణంగా పంజాబ్ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి సాయాన్ని అందించలేదు. తనకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆమె తాజాగా ట్వీట్ లో పేర్కొంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. ఆమెను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా దివ్యాంగ సంక్షేమ శాఖ కమిషనర్ శైలజను.. ఇతర అధికారులను పంజాబ్ కు పంపిన మంత్రి కేటీఆర్.. ఆమెను ప్రగతిభవన్ కు తీసుకొచ్చారు. తన కార్యాలయంలో ఆమెను కలిసి రూ.15 లక్షల ఆర్థిక సాయాన్ని.. ఒక ల్యాప్ టాప్ ను ఆమెకు అందించారు. అదే సమయంలో కేంద్ర నుంచి ఆమెకు సాయం అందాలని కోరుతూ కేంద్ర క్రీడాశాఖ మంత్రిని కోరారు. పంజాబ్ క్రీడాకారిణిని ఆదుకోవటానికి ప్రజాసొమ్మును వాడకుండా.. సొంత సొమ్మును వాడిన కేటీఆర్ తీరును తప్పనిసరిగా అభినందించాల్సిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement