Wednesday, November 20, 2024

వ‌రి కోసం బీజేపీ మెడ‌లు వంచుతాం: KTR

తెలంగాణలో యాసంగి వడ్లు కొంటామ‌నే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడ‌లు వంచాము.. వ‌రి కొనుగోలు కోసం బీజేపీ మెడ‌లు వంచ‌లేమా అని వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన రైతుల మ‌హా ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణలో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీలు పెడుతోంది అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతుల వెంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా..? అని ప్ర‌శ్నించారు. దేశానికి ఒక్క విధానం ఉండనవసరం లేదా? అని నిలదీశారు.

సీఎం కేసీఆర్ వ్య‌వ‌సాయానికి పెద్ద‌పీట వేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్లలో తుడిచి పెట్టగలిగామ‌ని చెప్పారు. 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్న మంత్రి కేటీఆర్… ఎరువులు, విత్త‌నాల‌కు లైన్లు క‌ట్టే ప‌రిస్థితి లేదన్నారు. చెరువులకు రూ. 20 వేల కోట్లు ఖర్చు పెట్టి భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచుకున్నామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు, రైతుబీమా ప‌థ‌కాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తుందని వివరించారు. రైతుబంధును కేంద్రం స‌హా 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయ‌ని చెప్పారు. రైతు చ‌నిపోయిన ప‌ది రోజుల్లోపై రైతుబీమా కింద రూ. 5 ల‌క్ష‌లు ఇస్తున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: కుప్పంలో కుక్కల్లా మొరుగుతున్నారు: వైసీపీపై నారా లోకేశ్

Advertisement

తాజా వార్తలు

Advertisement