Thursday, November 21, 2024

ముగిసిన మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌ట‌న

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ‌ మంత్రి కేటీఆర్ అమెరికా ప‌ర్య‌టించారు. నేటితో ఆయ‌న అమెరికా పర్యటన ముగియనుంది. తెలంగాణకు భారీ పెట్టుబడులు తెచ్చే లక్ష్యంతో కేటీఆర్ పర్యటన కొనసాగింది. అయితే చివరి రోజున తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అనేక పరిశ్రమలు ముందుకు వచ్చాయి. చివరి రోజు నాలుగు సంస్థలు తాము తెలంగాణలో పరిశ్రమలను స్థాపించేందుకు సిద్ధమని అంగీకారాన్ని తెలిపాయి. లైఫై సైన్సెస్, ఆర్ఏ చెమ్ ఫార్మా, అవ్రా లేబిల్ కంపెనీ, అడ్వెంట్ ఇంటర్నేషనల్, స్లే బ్యాక్ ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. మొత్తం దాదాపు ఏడు రోజుల పాటు సాగిన కేటీఆర్ అమెరికా పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు రావడం విశేషం. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని, తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విష‌యం విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement