భారత్‌లో ఫేస్‌బుక్, ట్విట్టర్‌పై కేంద్రం నిషేధం విధిస్తుందని ప్రచారం జరుగుతున్న వేళ మంత్రి కేటీఆర్‌కు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశారు. ఇండియాలో ట్విట్టర్‌పై నిషేధం విధిస్తే మీరేం చేస్తారని ఒకరు ప్రశ్నించారు. దానికి బదులుగా మంత్రి కేటీఆర్ ఒకవేళ ట్విట్టర్‌ను బ్యాన్ చేస్తే తాను పూర్తిగా సోషల్ మీడియానే వదిలేస్తానంటూ సమాధానం ఇచ్చారు. కేటీఆర్ సమాధానంపై అదే పేజీలో ఆసక్తికర చర్చ జరిగింది. ప్రస్తుత సంక్షోభంలో ట్విట్టర్ కారణంగా చాల మందికి మేలు జరగుతోందని.. కేటీఆర్ కూడా ఎంతో మంది కరోనా బాధితులకు ట్విట్టర్ వేదికగా సాయం చేయగలుగుతున్నారని కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం మరోవిధంగా స్పందించారు.
కేటీఆర్ ట్విట్టర్ వదిలేస్తే బాగుంటుదని తాము కోరుకుంటున్నామని.. కనీసం అప్పుడైనా ప్రజలకు మధ్యకు వచ్చి వారి సమస్యలు పరిష్కరించే వీలుకలుగుతుందేమో అని మరికొందరు కామెంట్ చేశారు. కేటీఆర్ సోషల్ మీడియాలో కంటే ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావడం మంచిది కదా అని కొందరు అభిప్రాయపడ్డారు. మరొకరు మాత్రం.. ‘మీరు ఆఫీస్‌లో ఉండండి. సాధారణ ప్రజలు వచ్చి సమస్యలపై కలుస్తారు’ అని కామెంట్ చేశారు. ఇదే సమయంలో మరో నెటిజన్ కేటీఆర్‌ని మరో ఆసక్తికర ప్రశ్న అడిగారు. ట్విట్టర్‌లో ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరైనా ఇబ్బంది పెడితే ఏం చేస్తారు అని అడగ్గా.. వారిని పట్టించుకోనని, అయినప్పటికీ వారు ఇబ్బంది పెడితే బ్లాక్ లేదా మ్యూట్ చేస్తానంటూ కేటీఆర్ సమాధానం ఇచ్చారు.