రానున్నది ఉద్యోగనామ సంవత్సరమని యువతకి బంగారు భవిష్యత్తును ఇచ్చే శుభకృత్వ సంవత్సరమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 80 వేల 39 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తున్నట్లు ప్రకటించడంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో ఈ నోటిఫికేషన్ ప్రకటన ఒక సారి చారిత్రాత్మకం అని అన్నారు. 11,039 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేయడం, 89,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల తెలంగాణ యువతకు, భావితరాలకు అద్భుతంగా ఉండబోతోందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ఇప్పుడు మరో 92 వేల పోస్టుల భర్తీ అవుతున్నాయన్నారు. తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2 లక్షలకు పైగా ఉద్యోగాల నియామకాలను ప్రభుత్వం చేయడం గొప్ప విషయం అన్నారు. యువత విద్యార్థులు ఉద్యోగాల కోసం కష్టపడి చదవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అలాగే ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు తెలంగాణ యువత, విద్యార్థుల తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement