Wednesday, November 20, 2024

కేంద్రానికి గుణపాఠం తప్పదు: మంత్రి అల్లోల వార్నింగ్

తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపెడుతున్న కేంద్రానికి గుణపాఠం తప్పదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించిన ఎందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఎమ్మెల్యే దాసరి తో కలిసి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం ససేమీరా అనడంతో రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ ఖజానాపై వేలాది కోట్ల రూపాయల భారం పడినా రైతాంగం ఇబ్బంది పడవద్దని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కౌన్సిలర్లు అమ్రేష్, చంద్రశేఖర్, గీతాంజలి వెంకటేష్, కల్పన రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement