ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షించారు. పూజలు, ఉత్సవాలకు ఏర్పాట్లు, ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ వంటి వాటిపై ఆరా తీశారు. అతిథులు విడిది చేసేందుకు గదుల కేటాయింపు, నీటి, భోజన వసతి, విద్యుత్ సౌకర్యం వంటి వాటి ఏర్పాట్లలో లోటులేకుండా చూడాలన్నారు. అదే విధంగా బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలపై శనివారం వీవీఐపీ అతిథి గృహంలో అల్లోల సమీక్ష నిర్వహించారు. అనంతరం యాగశాలలో విఐపిల కోసం భోజన వసతి, విడిది గృహాలు, పార్కింగ్, తదితర ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ బాబు, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, ఈవో గీతా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.