తెలంగాణలో మరో చారిత్రక ఘట్టానికి నాంది పలకబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయబోయే సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద రాబోయే రోజుల్లో ఆందోల్, నారాయణ్‌ఖేడ్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుందని హరీశ్‌రావు తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేయడం ఎంతో సంతోషంగా ఉందని హరీశ్‌రావు చెప్పారు.
కాగా, ఈ రెండు ప్రాజెక్టులను సుమారు రూ.4,400 కోట్లతో నిర్మించనున్నారు. అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నీటిని మొదట కేఎల్‌ఐఎస్ ప్యాకేజీ-18లో భాగంగా అందోల్ నియోజకవర్గంలోని సింగూర్ గ్రామం వద్ద మంజీర మీదుగా నిర్మించిన సింగూర్ ప్రాజెక్టులోకి పంప్ చేస్తారు. అదే నీటిని SLIP, BLIP ద్వారా సంగారెడ్డి మీదుగా పంపింగ్ చేస్తారు.