తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీష్ రావు ఫోన్ చేశారు. కోడకండ్ల దగ్గర కెనాల్‌ను మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా కెనాల్ నుండి కూడవెళ్లి వాగులోకి నీటిని వదలాలని రైతులు కోరారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో మంత్రి హరీష్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. దీంతో తక్షణమే నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని కేసీఆర్ ఆదేశించారు. కూడవెళ్లి పరిసర రైతులకు దాదాపు 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీష్‌రావు పేర్కొన్నారు.
గజ్వేల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్‌రావును కలిసిన రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయని, కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన హరీశ్‌రావు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించారు. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ జలాశయానికి నీటిని తీసుకెళ్లే కోడకండ్ల కాలువకు గండిపెట్టి సమీపంలో ఉన్న కూడవల్లి వాగులోకి నీటిని వదిలితే సమస్య పరిష్కారమవుతుందని గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని మంత్రి హరీశ్ అక్కడి నుంచే ఫోన్ ద్వారా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ వెంటనే పనులు ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. రైతులు చేసిన విజ్ఞప్తికి మంత్రి హరీశ్‌రావు చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కారం చూపారు.
కేసీఆర్కు హరీష్ ఫోన్.. సమస్య పరిష్కారం
Advertisement
తాజా వార్తలు
Advertisement