మల్లన్న సాగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రానున్నట్లు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మొండి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి మండుటెండల్లో సైతం చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని మంత్రి వివరించారు. రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ప్రాజెక్టును పూర్తి చేసుకుని హల్దీ వాగు ద్వారా అన్నీ ప్రాంతాలకు సాగునీరు అందించామని మంత్రి చెప్పారు.
సిద్ధిపేట జిల్లాని పలు గ్రామాల్లో గురువారం పల్లె ప్రగతిలో భాగంగా నాలుగవ విడత కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ గ్రామాలన్నీ నిర్లక్ష్యానికి గురైయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల స్వరూపాలు మారిపోయాయని వివరించారు. పల్లెలన్నీ, పట్టణాలుగా తీర్చిదిద్దబడ్డాయన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేసి స్వచ్ఛ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. డంపు యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించి పట్టణాలకు ధీటుగా తయారు అవుతున్నాయ వివరించారు. సేంద్రీయ ఎరువులు తయారు చేసి మొక్కలకు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలతో గ్రామాలన్నీ పురోభివృద్ధిలో ముందు వరుసలో నిలుస్తున్నాయని మంత్రి హరీష్ తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో కేసీఆర్ ఖేల్ ఖతం: బండి సంచలన వ్యాఖ్యలు