Thursday, November 21, 2024

పార్ల‌మెంట్ సాక్షిగా గోబెల్స్ ప్రచారం.. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ‌లో మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్ర‌భుత్వం ప‌దే ప‌దే ప‌చ్చి అబ‌ద్ధాలు వ‌ల్లె వేస్తున్న‌దని అన్నారు. పార్ల‌మెంట్ సాక్షిగా గోబెల్స్ ప్ర‌చారానికి దిగిందని మండిపడ్డారు. మొన్న గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల పెంపు ప్ర‌తిపాద‌న‌లు తెలంగాణ నుంచి రాలేద‌ని చెప్పిన కేంద్రం.. ఈరోజు మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుపైనా లోక్ స‌భ వేదిక‌గా దుష్ప్ర‌చారం చేస్తున్న‌దని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి త‌మ‌కు ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌ని కేంద్ర వైద్యారోగ్య‌శాఖ స‌హాయ మంత్రి భార‌తీ ప‌వార్ పార్ల‌మెంట్‌లో చెప్ప‌డం బాధాక‌రం అని పేర్కొన్నారు. మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించిందని చెప్పారు. అయినా కేంద్ర మంత్రులు పార్ల‌మెంట్ సాక్షిగా ప‌చ్చి అబ‌ద్ధాలు ఆడుతూ తెలంగాణ‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నారని మండిపడ్డారు. కేంద్రం స‌హ‌క‌రించక‌పోయినా సీఎం కేసీఆర్ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీ దిశ‌గా తెలంగాణ ప్ర‌భుత్వం అడుగులు వేస్తున్న‌దని మంత్రి హరీష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement