Saturday, November 23, 2024

బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు..: పాతాళానికి తొక్కేస్తామన్న మంత్రి గంగుల

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మధ్య దాడుల సంఘటన అనంతరం బిజెపికి చెందిన కొందరు కార్యకర్తలు జిల్లా టిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర బిసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మానకొండూరు ఎంఎల్ఏ రసమయి బాల కిషన్, చొప్పదండి ఎంఎల్ఏ సుంకి రవి శంకర్ తదితరులను ఎల్లారెడ్డి పేటలోని ఆగయ్య ఇంటికి వచ్చి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి గంగుల  కమలాకర్ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా ఆగయ్య ఇంటికి వచ్చానని తెలిపారు. టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలపై దాడులను ఖండించారు. కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా పలువురు బిజెపి కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని తట్టుకోలేక తమ పార్టీ నాయకులపై దాడులకు తెగబడ్డారని మంత్రి గంగుల ఆరోపించారు.

బిజెపి కార్యకర్తలు సాయి,రామచంద్ర రెడ్డిలు సామాజిక మాధ్యమాల్లో టిఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యులైన, మహిళలపై అసభ్యకరమయిన పోస్టులు పెట్టారని అన్నారు. రాష్ట్రంలో టీఆరెఎస్ కుటుంబం చాలా పెద్దదని, బిజెపి పార్టీ నాయకులు,కార్యకర్తల సంఖ్య బలం ఎంత అని ప్రశ్నించారు.  బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు మంది ఉన్నామని అన్నారు. తాము అభివృద్ధి,సంక్షేమం దిశగా పని చేస్తున్నామన్నారు. బిజెపి పార్టీ మాదిరిగా దాడులకు దిగితే ఒక్కరూ కూడా మిగలరాని మంత్రి హెచ్చరించారు. బిజెపి పార్టీ బడుగు ,బలహీన వర్గాల మీద దాడులు  చేస్తున్నారని ఆరోపించారు. తమ సహనాన్ని పరీక్షించ వద్దని సూచించారు. తమ మంచితనం అసమర్ధతగా భావించరాదు అని అన్నారు. తమ బలం ముందు మీ బలం ఎంత అని పేర్కొన్నారు. తమ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ దాడులకు తెగబడమని చెప్పలేదని అన్నారు. తమ దృష్టి అభివృద్ధిపైనేనని, మేము అందుకే పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క టిఅర్ఎస్ కార్యకర్తకు బాధ వచ్చినా ,దాడులు జరిగినా తమ బాధ కలుగుతుందని గంగుల కమలాకర్ తెలిపారు. కబర్ దార్ బిజెపి నాయకుల్లారా, కార్య కర్తల్లార అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా లో అసభ్యంగా పోస్టులు పెట్టే వారిపట్ల పోలీసులు కాటిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర డిజిపి పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement