ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్, నల్గొండ,మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఏకదాటిగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వాన ప్రభావాలతో రాష్ట్రంలోని పలు చోట్ల పంటలు, తోటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం సైతం.. టార్ఫిన్లు లేక తడిసి ముద్దయిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అకాల వర్షాలపై పౌరసరఫరాల శాఖ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరా తీశారు. వర్షాల కారణంగా ఎఫెక్ట్ అయిన ధాన్యం కేంద్రాలపై సివిల్ సప్లై అధికారులు, జిల్లా కలెక్టర్ల నుండి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement