Sunday, November 24, 2024

తెలంగాణలో రేషన్ కార్డుల లెక్క ఇదీ..

తెలంగాణలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి రేష‌న్ కార్డు అందిస్తామని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. గురువారం శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా కొత్త ఆహార భ‌ద్ర‌తా కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. అర్హులపై కేంద్రం పరిమితులు విధించినా, సీఎం కేసీఆర్ అన్నార్థులు ఉండకూడదని ప్రతీ అర్హునికి రేష‌న్ కార్డు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకూ రేషన్ కార్డుల కోసం 9,53,394 ద‌ర‌ఖాస్తులు రాగా… ఇందులో 6,70,999 కొత్త రేష‌న్ కార్డులు అందించామ‌ని వివరించారు. వీటి ద్వారా 21,30,194 మంది ల‌బ్ది పొందుతున్నారని తెలిపారు. 2016లో 94,417 కార్డులు 3,30,459 లబ్దిదారులు, 2017లో 36,039 కార్డులు.. 1,26,136 లబ్దిదారులు, 2018లో 1,65,036 కార్డులు.. 5,77,626 లబ్దిదారులు, 2019లో 64,471 కార్డులు.. 2,25,649 లబ్దిదారులు, 2020లో 11 కార్డులు.. 39 ల‌బ్దిదారులు, 2021లో 3,11,025 కార్డులు.. 8,70,285 లబ్దిదారులకు కార్డులు అందజేశామ‌న్నారు.

ఇది కూడా చదవండి: అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement