కరీంనగర్ వేగంగా అభివృద్ధి..
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది..
రోడ్లన్నీ విశాలంగా మారుతున్నాయి…ఫూట్ పాత్ లు.. డివైడర్లు ఏర్పాటు చేస్తున్నాము
రానున్న రెండేళ్ళలో గొప్ప నగరంగా తీర్చి దిద్దుతున్నాము..
వెంకటేశ్వర కాలనీ, వాసుదేవ కాలనీ ల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాము… స్వాగత తోరణానికి సొంత నిధులు
కాలనీ ల అభివృద్ధి కి ఎన్ని నిధులైన కేటాయిస్తాం..
రానున్న రెండేళ్లలో కరీంనగర్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడించారు..
12 వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ తో పాటు.. వెంకటేశ్వర కాలనీ స్వాగత తోరణ నిర్మాణ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భుమి పూజ చేశారు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు.. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ మంత్రి గంగుల కమలాకర్ ..మేయర్ సునీల్ రావు లను గజమాలతో సత్కరించారు… తమ కాలనీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు… ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో అభివృద్ధి పనులు శరవేగంగాకొనసాగుతున్నాయని పేర్కొన్నారు.. తమకు ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వొమ్ము చేయకుండా నగరంలోని ప్రతి డివిజన్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు…
ఇప్పటికే నగర వ్యాప్తంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని..విశాలమైన రోడ్లు ,రోడ్డు మధ్యలో అందమైన డివైడర్లు.. ఫూట్ పాత్ లు నిర్మించమని గుర్తు చేశారు..12వ డివిజన్ లోని నూతనంగా ఏర్పడ్డ వెంకటేశ్వర కాలనీలలోని అన్ని రోడ్లను ,డ్రైనేజిలను నిర్మిస్తామని ఇప్పటికే ఈ డివిజన్ అభివృద్ధికి 2 కోట్ల నిధులు కేటాయించమని అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం గుర్తు చేశారు… మరో 3 కోట్ల నిధులు కేటాయిస్తామని వెల్లడించారు..స్వాగత తోరణ నిర్మా నాణానికి తాను సొంతంగా 5లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు… ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు కార్పొరేటర్ తోట రాములు వెంకటేశ్వర కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అన్నాడీ కృష్ణారెడ్డి , ప్రధాన కార్యదర్శి బత్తిని సంపత్ గౌడ్ రవికుమార్ , మద్ది రమేష్ గౌడ్ గుగ్గిళ్ల జయశ్రీ కాలనీ వాసులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..