కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున క్రీడా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ స్టేడియం లో ఆధునీకరించిన ఇండోర్ స్టేడియం ,స్కెటింగ్ రింగ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. యువత చదువుతో పాటు క్రీడలు పై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలోప్రణాళిక సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ , నగర మేయర్ వై. సునీల్ రావు తో పాటు పలువురు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..