స్నేహం వేరు, రాజకీయాలు వేరు. తిట్టుకున్నంతమాత్రాన కలవకా మానరు. ఇప్పుడదే రుజువయింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయన ఇంట పెళ్ళిసందడి నెలకొంది. ఆయన కుమారుడి నిశ్చితార్థ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో రాజకీయపార్టీలకి అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. ఏపీ మంత్రి ఆహ్వానం మేరకు ఈ వేడుక కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో ప్రధానంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బొత్సా – చిరంజీవి మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి..
నేడు జరిగిన బొత్సా కుమారుడి నిశ్చితార్ధ వేడుకలో మా అధ్యక్షుడు మంచు విష్ణు సైతం హాజరయ్యారు. చిరంజీవి వేదిక పైకి రావటంతోనే పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు వైఎస్సార్సీపీ నేతలు హాజరై వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయినా, మంత్రి బొత్సా ఆహ్వానించటంతో వచ్చి కాబోయే వధూ వరునుల ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ గా మారాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..