హీరో నాని వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. టిక్కెట్ రేటు తగ్గితే రెమ్యూనరేషన్ తగ్గుతుందని వారి బాధ అన్నారు. భీమ్లానాయక్, వకీల్ సాబ్ కి పెట్టిన ఖర్చు ఎంత అని నిలదీశారు. పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అన్నారు. తన క్రేజ్ ని పవన్ కల్యాణ్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రొడక్షన్ కాస్ట్ 20శాతం అయితే , రెమ్యునరేషన్ 80శాతం ఉందన్నారు మంత్రి. హీరో నాని భజనపరుడు అని మంత్రి అనిల్ అన్నారు. అసలు నాకు హీరో నాని ఎవరో తెలియదని.. నాకు తెలిసింది కొడాలి నాని మాత్రమేనని చురకలు అంటించారు.పవన్ కల్యాణ్ మోజులో పడి నేను కూడా చాలా తగలేసానని ఫైర్ అయ్యారు. అమ్మా..నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బు ను కొందరు యువకులు క్రేజ్ కోసం సినిమాలకు ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..