Friday, November 22, 2024

24న ఈవీ మార్కెట్లోకి.. మినీ కూపర్‌ ఎలక్ట్రిక్‌ కారు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూ తమ మినీ కూపర్‌ ఎలక్ట్రిక్‌ కారును మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మినీ కూపర్‌ ఎస్‌ఈ కారును 2022 ఫిబ్రవరి 24న భారత్‌లో విడుదల చేయనుంది. దీనికోసం సంస్థ ప్రీ బుకింగ్‌ కూడా ఓపెన్‌ చేసింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని లాంచ్‌ చేసిన తరువాత మినీ కూపర్‌ ఎస్‌ఈ త్రీడోర్‌ ఎలక్ట్రిక్‌ కారును భారత్‌లో లాంచ్‌ చేయనుంది.

తొలిబ్యాచ్‌లో 30 యూనిట్ల కార్లు ఇప్పటికే సేల్‌ అయ్యాయి. కాగా కొత్త మినీ కూపర్‌ ఎస్‌ఈని ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆవిష్కరించారు. మినీ కూపర్‌ ఎస్‌ఈ 32.6 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ చేత పనిచేస్తుంది. 182 హెచ్‌పీ పవర్‌ఉన్న ఈ మోడల్‌ 7.3సెకన్లలో 0-టు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మినీకూపర్‌ టాప్‌స్పీడ్‌ గంటకు 150కిలోమీటర్లు. డబ్ల్యూఎల్‌ టీపీ ప్రకారం కూపర్‌ ఎస్‌ఈని ఒకసారి ఫుల్‌ఛార్జ్‌ చేస్తే 270కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్‌ కారును 11కెడబ్ల్యూ ఛార్జర్‌ సహాయంతో 2.5గంటల్లో 0 నుంచి 80శాతం వరకూ, 50కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌ సహాయంతో కేవలం 35నిమిషాల్లో 0 నుంచి 80శాతం వరకు చార్జ్‌ చేయొచ్చు. తాజాగా బుక్‌ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ ఈ ఎలక్ట్రిక్‌ కారును వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా ఆ తర్వాత డెలివరీ చేసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement