Friday, November 22, 2024

సీజ్‌వెర్క్‌ నుంచి మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్‌.. వినియోగదారుల ఆరోగ్యమే కీలకం

ప్యాకేజింగ్‌ అవసరాలతో పాటు లేబుల్స్‌ కోసం ప్రింటింగ్‌ ఇంక్‌లు, కోటింగ్స్‌ను అందించే అంతర్జాతీయ సంస్థల్లో ఒకటి కావడంతో పాటు జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగిన సీజ్‌వెర్క్‌, భారతదేశంలో మార్కెట్‌ కోసం తమ మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్‌ను విడుదల చేసినట్టు వెల్లడించింది. రసాయనాలతో కూడిన భారీ సమూహం మినరల్‌ ఆయిల్స్‌. వీటికి ఉన్న విషపూరిత లక్షణాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నది. మినరల్‌ ఆయిల్‌ హైడ్రో కార్బన్‌ పూత కలిగిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడింది. దీన్ని నివారించేందుకు మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ఇంక్‌ను సీజ్‌వెర్క్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెగా సిరీస్‌ వర్చువల్‌ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో సీజ్‌వెర్క్‌, తాము భారత్‌లో 100శాతం ఆహార భద్రతా కార్యకలాపాలను చేరుకున్నామని తెలిపింది. భీవండిలోని తయారీ యూనిట్‌ను పూర్తి శ్రేణిలో మినరల్‌ ఆయిల్‌ ఫ్రీ ప్లాంట్‌గా మార్చినట్టు వెల్లడించింది.

వాతావరణ వ్యవస్థ మెరుగునకు కృషి
ఈ సందర్భంగా సీజ్‌వెర్క్‌ ఇండియా సబ్‌ కాంటినెంట్‌ సీఈఓ రామ కృష్ణ కారాంత్‌ మాట్లాడుతూ.. గత కొన్ని ఏళ్లుగా ఆహార వస్తువుల ప్యాకేజింగ్‌లో మినరల్‌ ఆయిల్‌ హైడ్రో కార్బన్స్‌, శాచురేటెడ్‌ మినరల్‌ ఆయిల్స్‌ (ఎంఓఎస్‌హెచ్‌) వల్ల కలిగే ప్రమాదాల గురించి సైంటిఫిక్‌ జర్నల్స్‌ అధ్యయనాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులతో పాటు వాతావరణ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ఎలాంటి హానికరమైన అంశాలకు లొంగకుండా.. భద్రతాపరమైన అంశాలను పెంపొందించుకుంటున్నాం. విష రసాయనాలతో కూడిన పదార్థాల వినియోగాన్ని నిలిపివేశాం. సీజ్‌వెర్క్‌ ఇండియా ఇకపై భారత్‌లో తమ బ్లెండింగ్‌ కేంద్రాల ద్వారా మినరల్‌ ఆయిల్స్‌ రహిత ఇంక్‌లను మాత్రమే సరఫరా చేయనుంది. సీజ్‌వెర్క్‌ ఆసియా అధ్యక్షులు అశీష్‌ ప్రధాన్‌ ఈ నూతన శ్రేణి మినరల్‌ ఆయిల్‌ రహిత ఇంక్‌లను ఆవిష్కరించారు. ఈ ఇంక్‌లో వెగా ప్రోరిచ్‌, వెగా ఇంప్రెషన్‌, వెగా నేచర్‌ ఎల్‌టీ, వెగా స్ప్రింట్‌, వెగా వైబ్రంట్‌ ప్లస్‌, వెగా ప్రైమ్‌ ఇంక్‌ లైన్స్‌ ఉంటాయి. ఆవిష్కరణ, భద్రత, అత్యున్నత ఉత్పత్తులు, సేవలను అందించే సామర్థ్యాలకు అనుగుణంగా వెగా శ్రేని ఉంటుందని సీజ్‌వెర్క్‌ ఇండియా షీడ్‌ఫెడ్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ బిజినెస్‌ హెడ్‌ ఆశీష్‌ ముఖర్జీ అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి క్రికెట్‌ కామెంటేటర్‌ హర్ష భోగ్లే కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement