లక్షలాది చైల్డ్ పోర్న్ వీడియోలు, ఫొటోలతో ఇటలీ మ్యుజీషియన్ ఈరోజు (శనివారం) పోలీసులకు పట్టుబడ్డాడు. అతని సిస్టంలోని హార్డ్ డిస్క్, స్మార్ట్ ఫోన్లోని ఆప్టికల్ మీడియా డేటాబేస్లో మొత్తం అవే ఉన్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో 49 ఏళ్ల ఇటలీ వ్యక్తిని అరెస్టు చేసినట్టు చెప్పారు. ఇటలీలోని మార్చే ప్రాంతంలోని కోస్టల్ సిటీ అంకోనాలో ఇతను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తన్నట్టు తెలిపారు.
అయన దాదాపు 20 ఏండ్లుగా ఇట్లాంటి పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోలను సేకరిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. అతని ఇంట్లో సోదాలు జరిపాం. కంప్యూటర్ హార్డ్ డిస్క్ నిండా పలు ఫోల్డర్లలో ఇట్లాంటి వీడియోలే ఉన్నాయి. చాలా ఫొటోలున్నాయి. అతని స్మార్ట్ ఫోన్లో కూడా బూతు ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. అని పోలీసులు తెలిపారు. అయితే అతను నేరం చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మైనర్లకు అతను మ్యూజిక్ క్లాసులు చెప్పేవాడని తెలుస్తోందన్నారు.