Sunday, November 24, 2024

భార‌త‌వైద్య శాస్త్రంలో మైలురాయి- గ‌ర్భాశ‌య క్యాన్సర్ కి వ్యాక్సిన్

ఇండియాలో ప్ర‌తి సంవ‌త్స‌రం ల‌క్ష‌మందికి పైగా మ‌హిళ‌లు గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ బారిన ప‌డ‌తున్నారు. కాగా వారిలో 65శాతం మంది మ‌ర‌ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్… క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్(Quadrivalent Human Papillomavirus vaccine) ను సెప్టెంబర్ 1న విడుదల చేశారు. గర్భాశయ క్యాన్సర్ 90 శాతం ఒకే ఒక నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంద‌ట‌. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీతో సంచలనం సృష్టించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ గర్భాశయ క్యాన్సర్లను నిరోధించే వ్యాక్సిన్ ని రూపొందించింది.

గర్భాశయ క్యాన్సర్ కి వ్యతిరేకంగా మనదేశంలో వ్యాక్సిన్ ని తయారు చేసే బాధ్యతను డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జూలై నెలలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఢిల్లీలోని ఐఐసీలో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాక్సిన్ ని ప్రారంభించారు.ఈ వ్యాక్సిన్ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించినట్లయిందని ఆయన తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ కి వ్యతిరేకంగా దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమావైరస్ వ్యాక్సిన్ ను మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. మనదేశంలో 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement