Mi-17V-5 హెలికాప్టర్.. మిగతా ఆర్మీ హెలికాప్టర్‌లతో పోలిస్తే ఇది చాలా అడ్వాన్స్‌డ్ అనే చెప్పవచ్చు. ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో ఆర్మీ ఈ హెలికాప్టర్‌లను ఉపయోగిస్తోంది.
Mi-8 ఎయిర్‌ఫ్రేమ్ నుండి దీన్ని డెవలప్ చేశారు. Mi-17 పెద్ద క్లిమోవ్ TV3-117MT ఇంజిన్‌లు, రోటర్లు మరియు Mi-14 కోసం అభివృద్ధి చేయబడిన ట్రాన్స్‌మిషన్‌తో పాటు భారీ లోడ్‌ల కోసం ఫ్యూజ్‌లేజ్ మెరుగుదలలతో అమర్చబడింది. Mi-8/17 హెలికాప్టర్‌కు మరికాస్త అడ్వాన్స్‌డ్ వర్షన్‌లో తయారు చేసిందే Mi-17V-5. రష్యాలోని కాజన్ హెలికాప్టర్స్ సంస్థ ఈ హెలికాప్టర్‌లను తయారు చేస్తోంది. ఈ హెలికాప్టర్‌లు అగ్ని ప్రమాదాల సమయంలో, కాన్వయ్ సమయంలో, పెట్రోలింగ్ సమయంలో.. ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 2008లో భారత డిఫెన్స్ అధికారులు 80 Mi-17V-5 హెలికాప్టర్‌లను ఆర్డర్ చేశారు. 2011లో వీటిని తయారు చేయడం ప్రారంభించిన కాజన్ సంస్థ.. 2018లో హెలికాప్టర్‌లను భారతదేశానికి అందించింది. Mi-17V-5.. TV3-117VM లేదా VK-2500 టర్బో ఇంజన్‌తో నడుస్తుంది. TV3-117VM ఇంజన్ ఉన్న హెలికాప్టర్ 2,100hp పవర్‌తో నడుస్తుంది. VK-2500 ఇంజన్ ఉన్న విమానం 2,700hp పవర్‌తో నడుస్తుంది.
Mi-17V-5 హెలికాప్టర్‌లో డిజిటల్ కంట్రోల్ సిస్టమ్ కూడా అమర్చబడి ఉంటుంది. ఇవి 250 కి.మీ. వేగంతో 580 కిలో మీటర్ల నుంచి 1,065 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించగలుగుతాయి. ఇందులో రెండు ఫ్యుయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఈ హెలికాప్టర్ ఒకేసారి 13.000 కిలోల బరువును మోయగలదు. ఏ వాతావరణంలో అయినా ప్రయాణం చేయగలదు. Mi-17V-5 హెలికాప్టర్.. సైన్యానికి ఆయుధాలను తీసుకెళ్లడానికి కూడా ఉపయోగపడుతుంది. మెషిన్ గన్స్, మిసైల్స్, రాకెట్స్ లాంటివి ఇందులో ఒకేసారి తీసుకెళ్లే అవకాశం ఉంది.