మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దాకా మెట్రోను విస్తరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో గచ్చిబౌలి మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో జర్నీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఈ మేరకు 31కిలోమీటర్ల మేర చేపట్టే పనులకు రూ. 6,250 కోట్ల వ్యయంతో అవుతుందని అంచనా వేశారు. కాగా, డిసెంబర్ 9వ తేదీన సీఎం కేసీఆర్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
Breaking: శంషాబాద్ ఎయిర్‌పోర్టు దాకా మెట్రో రైలు.. సెకండ్ ఫేజ్ పనులకు డిసెంబర్ 9న శంకుస్థాపన
Advertisement
తాజా వార్తలు
Advertisement