Friday, November 22, 2024

ఇటలీ ప్రధానిగా మెలోనీ ప్రమాణం.. తొలి మహిళా ప్రధానిగా రికార్డు

ఇటలీ కొత్త ప్రధానిగా జార్జియా మెలోని శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మితవాద నేతగా పేరున్న 45 ఏండ్ల జార్జియా మెలోనీ ప్రధాని పీఠం అధిష్టిస్తున్న తొలి మ#హళగా రికార్డుకెక్కారు. అధ్యక్ష భవనంలో దేశాధ్యక్షుడు సెర్గియో మత్తరెల్లా సమక్షంలో మెలోనీతోపాటు, 24 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత శుక్రవారం మెలోనీ తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. సొంత పార్టీకి చెందిన తొమ్మిది మందికి కేబినెట్‌లో చోటిచ్చారు. లీగ్‌, ఫోర్జా ఇటాలియాలకు ఐదేసి శాఖలు కేటాయించారు. మొత్తంగా ఆరుగురు మహిళలకు అవకాశం కల్పించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఆర్థిక మాంద్యం, ఇంధన బిల్లుల వంటి సవాళ్ల మధ్య కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.

దీంతో ఇటలీలో బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. నాలుగేళ్ల కిందట కేవలం 4.13 శాతం ఓట్లు పొందిన మెలోనీ పార్టీ, ఇటీవలి ఎన్నికల్లో 26 శాతం ఓట్లు సాధించింది. ఫోర్జా ఇటాలియా, లీగ్‌ పార్టీలతో కూడిన ఆమె నేతృత్వంలోని కూటమికి 43 శాతానికి పైగా ఓట్లు లభించాయి. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీలో ఒక మితవాద నేత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. జార్జియా పార్టీ ఇటాలియన్‌ నియంత ముస్సోలినీకి మద్దతుదారు. వలసదారులకు ఆశ్రయం ఇవ్వకపోవడం, స్వలింగ సంపర్కులను వ్యతిరేకించడం, తన ఎన్నికల ఎజెండాగా మెలోనీ ప్రకటించి ప్రజల మద్దతు కూడగట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి ఆశించిన రీతిలో మద్దతు రావడంతో అనూ#హ్యగా ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చింది. తన పదునైన మాటలతో యువతను ఆకట్టుకోవడం మెలోనీ ప్రత్యేకత.

జార్జియా మెలోనీ 15 జనవరి 1977న జన్మించారు. జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయవేత్తగా ఎదిగారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, నియంత ముస్సోలినీ మద్దతుదారులచే ప్రారంభమైన ఉద్యమంలో 15 ఏళ్ల వయసులో మెలోనీ పనిచేశారు. రోమ్‌లో జన్మించిన మెలోని ఇంగ్లిష్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌ మాట్లాడతారు. చిన్న వయసులోనే తండ్రి వదిలిపెట్టి వెళ్లడంతో తల్లి సమక్షంలో పెరిగింది. మెలోనీ 21 ఏళ్ల వయసులో తొలి ఎన్నికల్లో విజయం సాధించి అధికారికంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 31 ఏండ్ల ళ్ల వయసులో బెర్లుస్కోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2012 లో నేషనల్‌ అలయెన్స్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొందరితో కలిసి బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీని స్థాపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement