ఆర్టిస్టుల జీవితాలే చాలా చిత్రంగా ఉంటాయని హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాది ఆవేదనవ్యక్తం చేసింది. జీవితంలో ఎలాంటి గ్యారంటీలేని బతుకులని తెలిపింది. అలాంటి అస్థిర జీవితాలను తాము ఇష్టపూర్వకంగానే ఎంచుకుంటామంది. సినిమా కోసం తమ శరీరాలను అనుకూలంగా మలచుకుంటామని… ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తుంటామని, కొన్నికొన్ని సార్లు అధ:పాతాళానికీ వెళ్లిపోతుంటామని తెలిపింది. ఒక్కోసారి రాత్రికి రాత్రే ఘనమైన విజయాలు సాధిస్తుంటామని, మరికొన్ని సార్లు వైఫల్యాలను చూస్తామని తెలిపింది. ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా సినీ జీవితంలో భాగంగా తాము అన్నిటికీ అలవాటు పడ్డామని ఆవేదన వ్యక్తం చేసింది. ఆకలి, నిద్ర, బాధ అన్నింటికీ ఓర్చుకుని పనిచేస్తామంది. చలనక.. ఎండనకా.. వాననక.. పగలు, రాత్రుళ్లన్న తేడా లేకుండా రోజులు, వారాలపాటు కష్టపడుతుంటామని తెలిపింది. ఇంటికి, కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటూ.. మరింత ముందుకు పోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటామని చెప్పింది. ఏది చేసినా.. ఎంత కష్టపడినా.. అంతిమంగా కళ కోసమేనని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..