దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో జరిగిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో అధికార, ప్రతిపక్ష నాయకులు సందడి చేశారు. మేఘాలయా అసెంబ్లీ స్పీకర్ ప్రీ క్రిస్మస్ వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కన్రాడ్ సంగ్మాతో పాటు ఎమ్మెల్యేలను ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో, సీనియర్ ఎమ్మెల్యే చార్లెస్ పింగ్రోప్ క్రిస్మస్ పాటలు పాడుతూ పండుగ ఆనందాన్ని పంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు క్రిస్మస్ పండుగ స్ఫూర్తితో విభేదాలను పక్కనపెట్టి సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital