Monday, November 25, 2024

కోవిడ్ నుంచి కోలుకున్న మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’ బ్యాక్ టూ వర్క్

ఇటీవల కరోనా బారిన పడిన మెగాస్టార్‌ చిరంజీవి పూర్తిగా కోలుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా షూటింగుల‌కు బ్రేక్ ఇచ్చిన ఆయ‌న మ‌ళ్లీ షూటింగ్స్ తో బిజీ అయ్యారు. బ్యాక్ టూ వర్క్ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా సెట్స్‌లోకి తాను ఉండ‌గా తీసిన ప‌లు ఫొటోల‌ను చిరంజీవి పోస్ట్ చేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించినవారందరికి ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్లు చిరు పేర్కొన్నారు.

సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి జోరు చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. కుర్రహీరోలకు పోటీ ఇస్తూ.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ‘ఆచార్య’ షూటింగ్​ ఇప్పటికే పూర్తి చేసిన చిరు.. ‘గాడ్​ఫాదర్’, ‘భోళా శంకర్’ చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నారు. బాబీ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీలోనూ మెగాస్టార్ నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement