మెగాస్టార్ చిరంజీవి రెండోసారి కరోనా బారిన పడ్డారు. కాగా ఇంటిలోనే ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా నేడు చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు చిరంజీవి. ‘అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు” అంటూ స్పందించారు. చిరంజీవికి శంకర్ బాబు అనే మరో ముద్దు పేరు ఉందని, అమ్మగారు ఆయనను అలానే పిలుస్తారని తెలుస్తుంది. కాగా అమ్మ పుట్టినరోజున నాడు పక్కన లేనన్న బాధ చిరంజీవిలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..