అభిమానుల పట్ల ఎంతో ఆపేక్షని చూపిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. కాగా రాజాం కొండలరావుకి మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం. కాగా ఇటీవల కొండలరావు కుమారై నీలవేణికి పెళ్ళి కుదిరింది. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వీరాభిమాని కుమారై పెళ్ళికి ఆర్థికసాయాన్ని చేశారు. ఆమె పెళ్లికోసం లక్ష రూపాయలని అందించారు. ఆ అమ్మాయికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ విషయాన్ని అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..