ప్రీతమ్ జుగక్కలర్ పేరు తెలుసుగా..నటులు నాగచైతన్య,సమంతల విడాకుల వివాదంలో ఈ పేరు తెగ మారు మోగింది. ఆఖరికి సమంత స్పందించి తను సోదరుడులాంటి వాడని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. కాగా మరోసారి ప్రీతమ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ప్రీతమ్, మెగా డాటర్ శ్రీజ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తన పుట్టినరోజున విషెష్ తెలియజేసిన అందరికి ధన్యవాదాలు చెబుతూ శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో బ్లూ డ్రెస్ లో ఉన్న అందమైన పిక్ పోస్ట్ చేసింది. శ్రీజ పోస్ట్ పై ప్రీతమ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. శ్రీజ ఫోటోకి ప్రీతమ్ ‘సుందర్ లడకి’ (అందమైన అమ్మాయి) అని కామెంట్ పెట్టాడు. ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి...