తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి పలు రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు సీఎం కేసీఆర్‌తో ఇవ్వాల (శనివారం) సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ విధి విధానాల గురించి అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
ఇక.. కేసీఆర్‌తో భేటీ అయిన వారిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందని నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల భోప్చే, ఛత్తీస్‌గఢ్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చన్బీలాల్ రాత్రే, గడ్చిరోలి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ ఉన్నారు.