Friday, November 22, 2024

ఏపీ వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పీఆర్సీ స‌మస్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌లేదు. రివర్స్ పీఆర్సీపై పోరాడుతున్న ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే పనిలో ప‌డ్డారు ఉద్యోగులు. అమరావతిలోని ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను వైద్యారోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి నెల ఏడో తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఓ ఎత్తైతే.. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం మరో ఎత్తు అవుతుందంటున్నారు ప్రతినిధులు. ఒకేసారి సమ్మెకు వెళ్లకుండా దశలవారీ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు పలువురు నేతలు. ఎస్మాను ముందుగా వైద్యారోగ్య శాఖ మీదే ప్రయోగిస్తారని స్పష్టం చేశారు ప్రతినిధులు. దీంతో ఉద్యోగులు ఏంచేయాలనేదానిపై యోచిస్తున్నారు. అత్యవసర సేవలకు విఘాతం కలిగి.. పేషెంట్లు మరణిస్తే వైద్యారోగ్య శాఖనే ప్రధాన దోషిగా నిలబెడతారని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement